Pages

ఆలోచింప చేసే కవితలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

కొన్ని కవితలు చదువుతుంటే మనకు మళ్ళీ,మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఆరోజు మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఈరోజు కవులు,కవయిత్రులు చాలా వరకూ సరైన ఆదరణ లేక అంతరించిపోతున్నారు. ఒకప్పుడు తెలుగు అగ్రిగేటర్లు చూస్తే ఎన్నో కవితా బ్లాగులు కనిపించేవి. ఇప్పుడు మచ్చుకు రెండు,మూడు తప్ప కవితా బ్లాగులే కనిపించడం లేదు. ఇప్పుడున్న వాటిలో మేరాజ్ ఫాతిమా గారు, పద్మార్పిత గారు చక్కగా వ్రాస్తున్నారు. అడపా,తడపా మరికొన్ని బ్లాగులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తాయి.